జబర్దస్త్ ప్రోగ్రాం ఈటీవీ లో మొదలై సుమారుగా 8 సంవత్సరాలు కావస్తుంది. అప్పటినుండి నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు తన జడ్జిమెంట్ తో కామెంట్స్ తో టీమ్ లీడర్లకు సపోర్టు ఇస్తూ జబర్దస్త్ ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఆ ప్రోగ్రాం కు గుడ్ బై చెప్పారు. నిన్నటితో జబర్దస్త్ కు నాగబాబు కు సంబంధం తెగిపోయింది. ఈ తరుణంలో త్వరలో జీ తెలుగు లో ప్రసారమయ్యే కొత్త ప్రోగ్రాం లో ఆయన కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా గా జబర్దస్త్ కార్యక్రమంలో నాగబాబు ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అంతేగాక జబర్దస్త్ నుండి 3 4 టీములు జీ తెలుగు కు వెళ్లిపోయాయి దానికి సంబంధించి ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
జబర్దస్త్ లో నాగబాబు రోజా ఇద్దరు జడ్జి గా వ్యవహరించేవారు. ఇప్పుడు నాగబాబు లేకుండా కేవలం రోజుతోనే షోను ముందుకు తీసుకువెళ్లాలని షో నిర్వాహకులు భావిస్తున్నారు. నాగబాబు ప్లేస్ లో అలీ డైలాగ్ కింగ్ సాయికుమార్ లను తీసుకురావాలని భావిస్తున్నారు ఇప్పటికే సాయి కుమార్ ఈ టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలలో యాంకరింగ్ చేసి సక్సెస్ సాధించిన విషయం తెలిసినదే. ఇక ఆలీ ఈ విషయానికి వస్తే ఆయన ఆలీతో జాలీగా వంటి ఇ కార్యక్రమాలతో ప్రేక్షకులకు ఎప్పుడు చెరువులోనే ఉంటాడు ఆయన గురించి ప్రత్యేకంగా అవసరంలేదు. వీరిద్దరితో పాటు బండ్ల గణేష్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం ఒకవేళ బండ్ల గణేష్ ను జబర్దస్త్ షో కి తీసుకు వస్తే ఆయన జబర్దస్త్ షో లో జడ్జిగా విధమైన పాత్ర పోషిస్తాడు అన్నది ఆసక్తి కరంగా మారింది. ఏది ఏమైనా నాగబాబు లేని జబర్దస్త్ షోలో ఆ స్థానాన్ని భర్తీ చేయడం సవాలే అని చెప్పాలి.