ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు.
అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన సూచించారు. తమ ఫోటోలు,మెసేజులు ఏదో ఒక రోజు బహిరంగమైన ఇబ్బంది లేదనుకునేవారు వాటిని వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్వో అనే సంస్థ ఇండియాతో సహ పలు దేశాలకు చెందిన 1400 మంది హక్కుల కార్యకర్తలు,రాజకీయ నాయకుల,న్యాయవాదుల ఫోన్లపై వాట్సాప్ లోని లొసుగు ద్వారా నిఘా వేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ పావెల్ తన టెలిగ్రామ్ లో పేర్కొన్నాడు.