భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా సీఎం జగన్ నిరుద్యోగులు విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు ఓవైపు గ్రామ వాలంటీర్ గ్రామాల్లో ఉన్న యువకులకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. ఉద్యోగాలు కల్పించి తమ అ గ్రామస్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే తాజాగా.. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు.. వెంటనే వెబ్‌సైట్ ప్రారంభించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే 7.33 లక్షల మంది నిరుద్యోగులు వెబ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లు డ్యాష్‌బోర్డులో నమోదైంది. ఇప్పటికే నమోదైన అభ్యర్థుల్లో 2.62 లక్షల మంది వారికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌కు సమర్పించారు. ఈ కార్పొరేషన్‌కు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఎండీ, ఈడీలకు ఇద్దరు జనరల్ మేనేజర్ల ఆధ్వర్యంలో రెండు విభాగాలు పనిచేయనున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల పట్ల వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల పట్ల కూడా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
