ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.