మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన,కాంగ్రెస్,ఎన్సీపీ పార్టీల అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ, శరద్ పవార్ నిన్న శుక్రవారం ప్రెస్మీట్ పెట్టి మరి ప్రకటించిన సంగతి విదితమే.
అయితే ఈ వార్త వచ్చి ఇరవై నాలుగంటలు గడవకుముందే మహారాష్ట్రలో ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీఎల్పీ నేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ ముందుకొచ్చారు.
ఎన్సీపీ మద్ధతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు విన్నవించారు పడ్నవీస్. దీంతో ముఖ్యమంత్రి పడ్నవీస్ ,ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి ఎన్నో మలుపులు తిరిగిన మహారాజకీయాలు ఇలా ముగిశాయి.