చంద్రబాబు, లోకేష్‌ల బండారాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ, టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని బాబుగారు అనుకుల ప్రతికలు టార్గెట్ చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అసహనం వ్యక్తం చేశాయి. అఖిలపక్షంలో విజయసాయిరెడ్డి అభాసుపాలు అంటూ బాబుగారి కులగురువు పత్రిక ఓ పచ్చకథనం అచ్చేసి విషం చిమ్మింది. అఖిల పక్షం భేటీలో జమ్ము కశ్మీర్‌లో గృహ నిర్బంధంలో ఉన్న మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తదితరులు ప్రస్తావించారు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడైన చిదంబరాన్ని కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోక్యం చేసుకున్నారంట..యుపీఏ హయాంలో తమ నాయకుడు జగన్‌మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైల్లో పెట్టిన నేతలు ఇప్పుడు ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారని..చెప్పబోయారంట..మిగతాపార్టీ సభ్యులు అడ్డుకుని ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అంటూ విజయసాయిరెడ్డిని నిలదీశారంట..ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్‌షా విజయసాయిరెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారంట..కాంగ్రెస్ వాళ్లు వారి వాదన వినిపించారు..మేం అవునని అన్లేదు..కాదని అన్లేదు..మధ్యలో మీ జోక్యం ఎందుకుని విజయసాయిరెడ్డిపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారంట..ఇది బాబుగారి తోక పత్రికల్లో వచ్చిన కథనం. తనపై వచ్చిన అసత్య కథనాలపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఆ రెండు పచ్చ పత్రికలను పార్లమెంట్‌లో బ్యాన్ చేయాలంటూ వారి పేర్లతో సహా వివరించి ప్రతిపాదించారు. తనపై అసత్యకథనాలు ప్రచురించిన రెండు పచ్చపత్రికలపై పార్లమెంటు ప్రివిలైజ్ కమిటీలో ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి.. తన పేరుప్రఖ్యాతుల్ని దెబ్బ తీసేలా నిరాధారమైన వార్తల్ని ప్రచురించారని మండిపడ్డారు. ఈ రెండు ఎల్లోమీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లను పార్లమెంటులోకి అనుమతించవద్దని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రతిపాదన అటు పార్లమెంట్‌లో, ఇటు మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
