వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. అవినీతి పాలన చేసిన ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పాడు.గత ప్రభుత్వంలో టీడీపీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇలా ప్రతీఒక్కరు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇవన్నీ సాక్షాత్ అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో అతని చేతులు మీదగా జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో… బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపి ప్రయోజనాల గురుంచి ప్రెస్ మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది” అని అన్నారు.