టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇప్పటివరకు ఇంటి గడపలోనే ఉన్న కుటుంబ విభేదాలు ఇప్పుడు ఆ గడప దాటి మీడియాకెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి చెందిన తాను మైనర్ గా ఉన్న సమయంలో తన అక్క అఖిల ప్రియ నా చేతి వ్రేలి ముద్రలు తీసుకోని తమ పేరిట రాయించుకున్నారు.
ఇప్పుడు తనకు రావాల్సిన వాటాను అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు అని రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు జగత్ విఖ్యాత రెడ్డి.ఎన్నికలకు ముందు రాజకీయంగా విబేధాలు వచ్చిన ఇరువురికి తాజాగా భూవివాదంలో కూడా సమస్యలుండటంతో మాజీ మంత్రి అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు.
మైనర్ గా ఉన్న తనకు తెలియకుండా అక్క, బావ కలిసి భూములు అమ్మినట్లు ఆయన పేర్కొన్నట్లు సమాచారం.దీంతో తనవాటా కోసం జగత్ విఖ్యాత్‌రెడ్డి ఫైట్ చేస్తున్నాడు. మొత్తానికి భూమా కుటుంబంలో రేగిన ఈ వివాదం ఎటు దారి తీస్తుందో అనే ఆందోళన కర్నూలు జిల్లా నంద్యాల ,ఆళ్లగడ్డ టీడీపీ కార్యకర్తల్లో ఉంది.