తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం బిజెపి నాయకుడు సుజనా చౌదరి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది లీడర్లు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీకి చెందిన కొంత మంది కూడా తమతో టచ్ లో ఉన్నారని తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కౌంటర్లు సర్వసాధారణంగా ఉంటాయి అయితే రాజేంద్ర మాత్రం సుజనా చౌదరి దారుణంగా తిట్టారు. ముఖ్యంగా సుజనాచౌదరి టిడిపిని వేయడం పట్ల ఆయన స్పందించారు. సుజనా చౌదరి ని టిడిపిని వీడితే వెంట్రుక కూడా లేదని ఇప్పుడు అతని వల్ల ఏమీ జరగదు అంటూ వ్యాఖ్యానించారు. ఓ వైపు చంద్రబాబు బిజెపికి దగ్గరవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు టిడిపి శ్రేణులు తమతో టచ్లో ఉన్నారని సుజనాచౌదరి వ్యాఖ్యానించడం దానికి ఆలపాటి రాజేంద్ర అకౌంట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
