సుజనా చౌదరి ప్రెస్ మీట్ విషయంలో ద్వజమెత్తిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని అన్నారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో తాను ఎందుకు టీడీపీ నుంచి బీజీపీకి వెళ్ళారో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ విషయానికి వస్తే “ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే… ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఎందుకు మార్చాడో అన్నీ అర్ధమవుతాయి” అని అన్నారు.
ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అరడజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే… ఆయన పార్టీ ఎందుకు మారాడో, @ncbn ఎందుకు మార్చాడో అన్నీ అర్ధమవుతాయి.@yschowdary @BJP4India
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 22, 2019