రకుల్ ప్రీత్ సింగ్ చూడగానే మత్తెక్కించే అందం.. మన ఇంట్లో అమ్మాయిలా అన్పించే చక్కని అభినయం. కుర్ర హీరో సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బక్కపలచు భామ టాప్ హీరో సరసన నటించే రేంజ్ కు ఎదిగింది. వరుస విజయాలతో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ ప్లేస్ కు చేరుకుంది. అయితే తను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్ళల్లో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది అని ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలొ చెప్పుకోచ్చింది.
ఆ ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” గతంలో నన్ను ఒక స్టార్ హీరో నాతో శృంగారం చేయమని అడిగాడు. అయితే ఆ హీరో నన్ను ప్రత్యేక్షంగా అలా అడగలేదు . కానీ చాలా పద్ధతిగా.. మర్యాదపూర్వకంగా నన్ను అడిగాడు. ఒక్కసారిగా ఆ హీరో అలా అడగటంతో కోపమోచ్చి అతనిపై అరిచాను.
నాకు ఇలాంటివి ఇష్టముండదు అని ముఖం మీద తేల్చి చెప్పాను”అని ఆ ఇంటర్వూలో చెప్పినట్లు ఒక ప్రముఖ పత్రికలో కథనం ప్రచురితమయింది. అయితే ఈ స్టార్ హీఱో ఎవరు అని మాత్రం చెప్పలేదు. కాకపోతే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోతో ప్రేమలో పీకల్లోతు ఉంది అని వార్తలు వచ్చిన సంగతి విదితమే.