సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 రెసిడెన్షియల్ కళశాలలు, 14 మోడల్ స్కూల్స్, 36 ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ తో వంద శాతం ఫలితాలు రాబట్టేలా విద్యాబోధన చేపట్టాలని, రాష్ట్ర ఉత్తీర్ణతలో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలనే అంశంపై డీఆర్వో చంద్రశేఖర్, ఉన్నత విద్యా శాఖ జూనియర్ కళాశాల జిల్లా ఆర్ఐఓ సుధాకర్ తో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు.
– పదవ తరగతి రాష్ట్ర ఉత్తీర్ణతలో 59.8 శాతం ఉండగా, సిద్ధిపేట జిల్లా ఉత్తీర్ణత శాతం 65.5 శాతం ఉందని, కానీ ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్రంలో ఉత్తీర్ణతలో సిద్ధిపేట జిల్లా15వ స్థానంలో ఉన్నదని, దీంట్లో జిల్లాలోని దౌల్తాబాద్ మండలం మొదటి స్థానం ఉందని., పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం పొందామని, ఈ విద్యా సంవత్సరం ప్రథమ స్థానం పొందాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అద్భుతమైన ఫలితాలు పొంది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో వెనుకంజలో ఉండటానికి కారణాలేంటనీ కళాశాలల ప్రిన్సిపాల్స్ ను మంత్రి ఆరా తీశారు.