తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన బిత్తిరి సత్తి మూడు మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ” ప్రస్తుతం ఆధునీక సాంకేతిక యుగంలో రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలి. అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు.
రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరొక నలుగురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
1) హాస్య నటుడు బ్రహ్మానందం 2) కల్వకుంట్ల హిమాన్సు రావు 3) ప్రియా దర్శిని 4) తీన్ మార్ శివ జ్యోతి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు