ఆర్టీసీ కార్మిక జాక్ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీకి చెందిన సిబ్బంది షాకిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన హన్మకొండ బస్ స్టేషన్ ఆవరణంలో ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ ఎన్ఎంయూ నాయకుడు యాకస్వామి మాట్లాడుతూ” జాక్ కన్వీనర్ గా ఉన్న అశ్వత్థామరెడ్డి సమ్మె పేరుతో మొత్తం కార్మిక వర్గాన్నే మోసం చేశాడు.
దాదాపు యాబై రోజుల పాటి నిరవధికంగా సమ్మె చేయించి ఇప్పుడు పక్కకు తప్పుకున్నాడు. ముప్పై మంది కార్మికుల చావుకు కారణమయ్యాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు విధుల్లోకి చేరాలని విన్నవించినప్పుడు తమ డిమాండ్లను వినకుండా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు పోరాడుదాం అని చెప్పి ఇప్పుడు తప్పుకున్నాడు “ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
దాదాపు యాబై రోజుల పాటు సమ్మెలో పాల్గొవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. ప్రభుత్వం దయతలచి తమను విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతున్నాను అని ఆయన అన్నారు.