ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. ఈ నేపధ్యంలో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ మళ్ళీ అదే తప్పు చేసింది. మొదటి టెస్ట్ లో బ్యాట్టింగ్ తీసుకొని 150పరుగులకే కుప్పకూలిన బంగ్లా ఇప్పుడు కూడా అదే రూట్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం 50పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్స్ దెబ్బకు బాట్స్ మెన్స్ నిల్వలేకపోయారు. ఇంకా చుస్కుంటే ఈరోజే ఆలౌట్ అయ్యే అవకాశం కూడా ఉండి. ప్రస్తుతం గ్రీజ్ లో మహ్మదుల్లా, లిటన్ దాస్ ఉన్నారు.
