దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన అది కొద్ది రోజులకే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి హెలికాప్టర్ లో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రజలకు మేలు చేయడమే కాదు వారికి ఏది కావాలో అది చేయాలనే ఉద్దేశంతో వైయస్ ప్రజల వద్దకు బయలుదేరారు. అయితే రచ్చబండ కార్యక్రమం కనీసం ప్రారంభం కాకముందే వైయస్ చనిపోయారు. దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో వచ్చిన జగన్ తండ్రి ఆశయాన్ని నెరవేర్చండి ముందడుగు వేస్తున్నారు.
ప్రజల వద్దకే జగన్ వెళ్లనున్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి తీరు అధికారుల పనితీరుపై నేరుగా ప్రజలని అడిగి తెలుసుకొనున్నారు. ఫిబ్రవరిలో ఇక్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఒకింత ఆందోళనకు గురవుతున్నారు పెద్దాయనను పోగొట్టుకున్న దుర్ఘటన కళ్ళముందు కదలాడుతుంది నేపథ్యంలో రచ్చబండ అనే కార్యక్రమం పట్ల కాస్త భయానికి గురి అవుతున్నారు అయితే జగన్ మాత్రం కచ్చితంగా రచ్చబండ కార్యక్రమం పూర్తి చేసి తీరతానని స్పష్టం చేశారు.