ఈ రోజు శుక్రవారం భారత్ క్రికెట్ మక్కాగా పేరు గాంచిన కలకత్తా ఈడేన్ మైదానంలో మొదటి సారిగా ప్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా బంగ్లాదేశ్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి విదితమే. తొలి పింక్ బంతి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజృంభించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లను కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసింది.
అయితే ఇప్పటివరకు టీమిండియా ఎరుపు బంతితో టెస్ట్ మ్యాచ్ ఆడి ఫస్ట్ టైం పింక్ బంతితో ఆడుతున్న నేపథ్యంలో ఆ బంతి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మాములుగా ఎరుపు బంతిని తయారు చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే పడుతుంది. కానీ పింక్ బంతి తయారు చేయడానికి మాత్రం ఎనిమిది రోజులు పడుతుంది.
దీనికోసం ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న లెదర్ తో తయారు చేస్తారు. బంతి చుట్టూ కొలత 22.5సెంటీమీటర్లు ఉంటుంది. లోపల భాగం మాత్రం కార్క్ ,రబ్బర్ తో తయారు చేస్తారు. ఈ బంతిని మూడు రకాల్లో లిప్ స్టిచ్ ,ప్రొనౌన్స్ డ్ స్టిచ్ ,78స్టిచస్ గా కుడతారు. బంతిని గ్రిప్ లో ఉంచుకోవడానికి ప్రొనౌన్స్ డ్ స్టిచ్ బాగా ఉపయోగపడుతుంది. బంతి బరువు మాత్రం 156గ్రాములుంటుంది.