సినిమా పేరు: జార్జ్ రెడ్డి
జానర్: ఉస్మానీయ ఉద్యమ కెరటం.. హైదరాబాద్ చెగో జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం
నటీనటులు: వంగవీటి ఫేం సందీప్ మాధవ్,సత్య దేవ్,మనోజ్ నందన్,చైతన్య కృష్ణ,వినయ్ వర్మ,అభయ్,ముస్కాన్,మహాతి తదితరులు
దర్శకత్వం: జీవన్ రెడ్డి
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ప్రోడ్యూసర్: మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా బయోపిక్ ల పర్వం కొనసాగుతున్న సంగతి విదితమే. అలనాటి మహానటి సావిత్రిపై తెరకెక్కిన మహానటి దగ్గర నుంచి నిన్నటి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి వరకు టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ రోజు శుక్రవారం ఉస్మానియా ఉద్యమ కెరటం.. హైదరాబాద్ చెగో జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జార్జ్ రెడ్డి మూవీ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి జార్జ్ రెడ్డి మూవీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్నదా..?. జార్జ్ రెడ్డి అసలు కథ ఏంటీ..?. అనుకున్న విధంగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడా..?. నాటి జార్జ్ రెడ్డిని నేడు ఈ మూవీలో చూపించడంలో విజయవంతమయ్యాడా.?. రియల్ గా అందరి మన్నలను అందుకున్న జార్జ్ రెడ్డి రీల్ లైఫ్లో సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రలో మెప్పించాడా..?. వీటిన్నిటిపై ఒక లుక్ వేద్దాం ..?
అసలు కథ:
జార్జ్ రెడ్డి ఉన్నత చదువుల కోసం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయ విశ్వవిద్యాలయంలో చేరతాడు. అప్పటికే రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలకు చెందిన అనుబంధ విద్యార్థుల సంఘాలు వెనకబడిన మరి ముఖ్యంగా దళిత బహుజన వర్గాలకు చెందిన విద్యార్థులను ,మహిళలను వేధింపులకు గురి చేసేవి.
కుల మత రాజకీయాలు చేసేవి అని అప్పట్లో ప్రచారంలో వార్తలు. అయితే జార్జ్ రెడ్డి అడుగు పెట్టేసరికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యేవి. జార్జ్ రెడ్డి పుట్టింది కేరళ. చదువులు బెంగుళూరు,చెన్నైలలో ముగించుకుని ఉస్మానీయలో అడుగుపెట్టి విద్యార్థి నాయకుడిగా ఎదుగుతాడు. అయితే ఈ యూనివర్సీటీలోనే మాయ(ముస్కాన్),దస్తగిరి(పవన్),రాజన్న(ఆభయ్)లతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ఎక్కడకి దారి తీసింది..? అప్పటి వరకు ఉన్న వివక్షత,చిన్న చూపుతనం లాంటి అంశాలపై ఎలా పోరాడాడు.?.
కేవల విద్యార్థి నాయకుడిగా ఉన్న జార్జ్ రెడ్డి ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ నగరంలోనే ఎవరికి కష్టమోచ్చిన తానే ధైర్యం ఎలా అయ్యాడు..?జార్జ్ రెడ్డి హైదరాబాద్ చెగో గా ఎలా మారాడు…? అతడు ఎందుకు యూనివర్సిటీ, సమాజం కోసం పోరాడతాడు? ఒకానోక సమయంలో సొసైటీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు? తన పోరాటంలో జార్జిరెడ్డి విజయం సాధించాడా? ఎందుకు హత్యకు గురవుతాడు? ఇంతకి జార్జిరెడ్డిని ఎవరు హత్య చేస్తారు? .ఇలా తదితర అంశాలు తెలియాలంటే తప్పకుండా జార్జ్ రెడ్డి చూసి తెలుసుకోవాల్సిందే..?
కథ విశ్లేషణ :
గతంలో దళం మూవీతో ఇండస్ట్రీలోనే విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి. ఉస్మానియా ఉద్యమ కెరటంగా.. విద్యార్థి నాయకుడిగా పీడీఎస్యూను స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి.. ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న జార్జ్ రెడ్డి బయోపిక్ తో మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తానేంటో నిరూపించుకోవడానికు తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చాడు జీవన్ రెడ్డి. జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో ఎక్కడా కూడా నేటివిటీకి తగ్గకుండా చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు.
జార్జ్ రెడ్డి జీవితంలో ఎన్నో మలుపులు.. సున్నితమైన అంశాలు ఉన్నప్పటికి ఎక్కడ కూడా ఎవర్ని నొప్పించక అందర్నీ మెప్పిస్తూ .. జార్జ్ రెడ్డికి చెందిన అసలు కథను ఎక్కడా కూడా డైవర్ట్ కాకుండా తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. అంతేకాకుండా అసలు ఒరిజినాల్టీ ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ పట్టకుండా కమర్షియల్ అంశాలను జోడించాలి. ఈ విషయంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. అప్పట్లో యూనివర్సిటీలో పెనుసంచలనం సృష్టించిన రాజకీయాలు, నేతలు, పార్టీల పేర్లను ఎక్కడా ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు జీవన్.
టైటిల్ పడిన దగ్గర నుండి శుభం కార్డు పడేవరకు కూర్చున్న సీట్లలో నుంచి పైకి లేవకుండా చేయడంలో దర్శకుడు తనకు తానే సాటి అన్పించుకున్నాడు. అందరికీ తెల్సిన కథే అయినప్పటికి ఎక్కడా కూడా ఆ విషయాన్ని గుర్తుకు తేకుండా తర్వాత ఏమి జరుగుతుంది అనే ఉత్సుకతను కల్గించదంలో దర్శకుడు ప్రతిభ పీక్ స్టేజ్ లో చేరుకుంది. మూవీలోని పాత్రల ఇంట్రడక్షన్ … రెండు మూడు చోట్ల హీరో ఎలివేషన్ తో ఫస్టాప్ తర్వాత ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత కాస్త డైరెక్టర్ తడబడినట్లు అన్పిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలనే ఉద్దేశంతో కథను కాస్త డీవియేట్ కొంచెం అయినట్టుగా అన్పించిన కానీ ఆ విషయాన్ని ప్రేక్షకులు తెలుసుకునేలోపు సస్పెన్స్ థ్రిల్లర్ తో కుర్చీలో కూర్చునేలా చేశాడు.
మూవీలో తల్లికొడుకుల మధ్య వచ్చే సీన్లు నా భూతో నా భవిష్యత్ అన్నట్లు ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు. ఇక హీరోయిన్ వన్ సైడ్ లవ్ ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య సీన్స్ కాస్త రోటీన్ కు భిన్నంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి. కెమెరా పనితనం బాగుండటంతో ఆ కాలానికి వెళ్లిపోతాం. ఇక యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా అనిపిస్తాయి.
ఇక సంగీతం విషయానికి వస్తే పాటలు సినిమాలోని సన్నివేశాలకు తగ్గట్లు ఉన్నాయి.ఎలాంటి తడబాటు లేకుండా స్క్రీన్ ప్లే చాలా చక్కగా ప్రజేంట్ చేశారు. అప్పటి కాలానికి తగ్గట్లు.. ట్రెండ్లీ గా ఉండే డ్రెస్సింగ్ ,సెట్టింగ్స్ ఆకట్టుకున్నాయి.ఎడిటింగ్ ,నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ఎవరెవరు ఎలా నటించారు :
నటీనటులు:
వంగవీటితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకున్న నటుడు సందీప్ మాధవ్. జార్జ్ రెడ్డి లో వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు . సినిమా అసాంతం తానై నడిపించాడు. అప్పట్లో జార్జ్ రెడ్డి ఎలా ఉన్నాడు ఇప్పుడు సందీప్ ను చూస్తే అలానే అన్పించింది. ఇక తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక నటించిందనే బదులు జీవించింది అనే చెప్పాలి. ఇక మిగతా వాళ్లు తమ తమ పాత్ర పరిధిలో న్యాయం చేశారు.
బలం:
*సందీప్ మాధవ్ నటన
*సెంట్మెంట్ సీన్స్ ,మథర్ సెంట్మెంట్
*సినిమాటోగ్రఫీ
*క్యాస్టూమ్స్
బలహీనతలు:
* కాస్త లయ తప్పిన సెకండాఫ్
*సెకండాఫ్ లో స్లో గా నడిచిన కథ
* డైలాగ్స్
రేటింగ్ :2.75/5