తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జాక్ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలనే దాదాపు నలబై తొమ్మిది రోజులుగా చేస్తోన్న నివరధిక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశాడు.
అయితే నిన్న సాయంత్రం ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ దాదాపు రూ. ఐదు వేల కోట్ల అప్పుల్లో ఉంది. తక్షణమే రూ. రెండు వేల కోట్లను చెల్లించాలి. నెలకు రూ. 240కోట్లను అందివ్వాలి. ఇప్పుడు అంత స్థోమత ప్రభుత్వానికి లేదు. ఆర్టీసీని నడపలేము అని తేల్చి చెప్పారు. అయితే ఆర్టీసీ సిబ్బంది విధుల్లోకి తీసుకునే అంశంపై నేడు శుక్రవారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకొనున్నది .
అయితే తాము సమ్మె విరమించిన కానీ ప్రభుత్వం తరపున ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగుతుంది అని హైదరాబాద్ లో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఆవరణలో జరిగిన సమావేశం సందర్భంగా అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికే అశ్వత్థామరెడ్డిపై తీవ్ర వ్యతిరేకతో ఉన్న ఆర్టీసీ సిబ్బంది తాజా నిర్ణయంతో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.