Home / ANDHRAPRADESH / దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఫైర్..!

దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఫైర్..!

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. వల్లభనేని వంశీతో మొదలైన తిట్ల పర్వం..ప్రస్తుతం మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమల మధ్య సాగుతోంది. సీఎం జగన్ పవిత్రమైన తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం లేదంటూ టీడీపీ చేస్తున్న మత రాజకీయాలపై.. మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. తిరుమలను చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడేమైనా కట్టించాడా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాస్త పరుషపదాలు మాట్లాడారు. సీఎంగా జగన్ ఈ రాష్ట్రంలో ఏ గుడికైనా, చర్చికైనా, మసీదుకైనా వెళ్లే అధికారం ఉంటుంది..మతం పేరుతో నీచ రాజకీయాలేంటి అంటూ ఫైర్ అయ్యారు. అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై దేవినేని ఉమా స్పందించాడు. తిరుమల తిరుపతి దేవస్థానంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన మంత్రి నానిపై సీఎం జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉమా ప్రశ్నించాడు. అంతే కాదు రాష్ట్రంలో దళలవారీగా మద్యం నియంత్రిస్తానన్న ప్రభుత్వం మద్యం అమ్మకాలను పెంచిందంటూ ఆరోపించాడు. నూతన మద్యం పాలసీతో మద్యం విక్రయాలతో పాటు ధరలు విపరీతంగా పెరిగాయని ఉమా విమర్శించాడు. ఉమా విమర్శలపై మరోమారు మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. … నీ చంద్రబాబు బ్రోకర్ దేవినేని ఉమా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో కేవలం జగన్ కు నచ్చిన బ్రాండ్లను మాత్రమే మద్యం షాపులలో విక్రయిస్తున్నారని, దాంతో కమీషన్ల దందా చేస్తున్నారంటూ ఉమా చేసిన వ్యాఖ్యలపై కూడా నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడ్డోడు చంద్రబాబు, పప్పు నాయుడు, నువ్వూ కలిసి ఏ బ్రాండ్ తాగుతారో చెప్పాలని అడిగితే ఇప్పటివరకూ దేవినేని సమాధానం చెప్పలేకపోయాడని నాని ఎద్దేవా చేశారు. అంతే కాదు పదవి కోసం వదినని ఎందుకు చంపావు అని దేవినేని ఉమను ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం చెప్పలేకపోయాడని నాని తనదైన స్టైల్లో నిప్పులు చెరిగాడు. పదవి కోసం వదినను చంపిన ఉమా, మంత్రిగా ఉన్నప్పుడు బ్రోకర్ పనులు చేశాడని, కమీషన్లు తీసుకెళ్లి పప్పు నాయుడుకి, వాడి బాబుకి ఇచ్చాడని పరుష పదజాలంతో మాట్లాడారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు కమీషన్లు తీసుకున్న ఉమా కు అందరూ కమీషన్లు తీసుకున్నట్లుగా కనిపిస్తోందని మంత్రి ఘాటుగా బదులిచ్చారు. నాడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని పెడితే పనికిమాలిన దద్దమ్మ అయిన చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చివేసాడని నాని ఆరోపించాడు. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరిగి మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంటే దానికి సహకరించాల్సింది పోయి పనికిరాని విమర్శలు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్ కమీషన్ల కోసం మద్యపాన నిషేధం అమలు చేస్తే, నేడు జగన్ మోహన్ రెడ్డి కూడా అలాగే చేసాడు అనుకోవాలని టీడీపీ నేతలకు మంత్రి అదిరిపోయే సమాధానమిచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కువగా వాడుకుంది కొడాలి నాని, వల్లభనేని వంశీలే ఉమా వ్యాఖ్యలకు నాని స్పందించారు..తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేరును వాడుకోని నాయకులు ఎవరైనా ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. మొత్తంగా దేవినేని ఉమాపై మరోసారి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat