గత ఐదు నెలలుగా చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్లు సీఎం జగన్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా వర్కవుట్ అవడం లేదు..టీడీపీకి పెద్దగా పొలిటికల్ మైలేజీ రావడం లేదు. అయితే తన స్వార్థ రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకోవడంలో కూడా చంద్రబాబు వెనుకాడడు. అసలు హిందూ సంప్రదాయాల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉండదు..వ్రతాలు, హోమాలు, భూశంకుస్థాపనలు, హిందువుల పండుగలలో బూట్లు వేసుకుని మరీ పూజలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. విజయవాడలో ఆలయాలను కూలగొట్టించిన నీచ చరిత్ర చంద్రబాబుది..కొడుకు లోకేష్ కోసం పవిత్రమైన బెజవాడ కనకదుర్గ ఆలయంలో అర్థరాత్రి పూట క్షుద్ర పూజలు చేయించాడని ఆరోపణలు కూడా బాబుపై ఉన్నాయి. ఆఖరికి టీటీడీని టీడీపీకి ఆర్థిక వనరుగా ఉపయోగించుకున్నాడు. ఢిల్లీలో మోదీని తిట్టడానికి చేసిన దొంగ దీక్షకు 4 కోట్ల వెంకన్న సొమ్మును దర్జాగా వాడుకున్నాడు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తిరుమల పవిత్రత గురించి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. సీఎం జగన్‌పై డిక్లరేషన్ అంటూ మతరాజకీయం చేస్తున్నాడు. అయితే తాజాగా వడ్డీ కాసుల వాడి సొమ్మును చంద్రబాబు మింగేసిన సంగతి బయటపడింది. సాధారణంగా టీటీడీ దేవస్థానానికి వచ్చే డబ్బులను బ్యాంకులలో డిపాజిట్ చేస్తారు, దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే నిర్వహణ ఖర్చులకు వాడుతారు. అయితే గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వంలో బ్యాంకుల్లో టీటీడీ సొమ్ము డిపాజిట్ చేసే మొత్తం తగ్గిపోతూ వస్తోంది. వెంకన్న స్వామి సొమ్ములో ప్రతి ఏటా కొంత తన స్వంత ప్రయోజనాలకు వాడుకున్నాడో..లేదా..జేబులో వేసుకున్నాడో తెలియదు కాని..టీటీడీ సొమ్ము డిపాజిట్లలో 2709 కోట్లు తేడా వస్తోంది. తాజాగా తేలిన లెక్కల ప్రకారం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014లో టీటీడీకి హుండీ ద్వారా 983 కోట్లు వస్తే..అందులో 963 కోట్లు మాత్రమే బ్యాంకులో డిపాజిట్ చేశారు. టీటీడీ ఆదాయానికి, డిపాజిట్‌కు 20 కోట్ల తేడా వస్తోంది. ఇక 2015లో టీటీడీకీ 1000 కోట్లు ఆదాయం వస్తే డిపాజిట్ చేసింది..కేవలం 247 కోట్లు మాత్రమే..2016 వ సంవత్సరంలో 1010 కోట్లు వస్తే డిపాజిట్ చేసింది కేవలం 525 కోట్లు మాత్రమే..అంటే సగానికి సగం మాత్రమే డిపాటిజ్ చేశారు. అలాగే 2017లో టీటీడీకీ 1116 కోట్లు ఆదాయం వస్తే..కేవలం 269 కోట్లు మాత్రమే డిపాజిట్ చేశారు. ఇక 2018లో టీటీడీకి 1156 కోట్లు వస్తే దారుణాతిదారుణంగా కేవలం 86 కోట్లు మాత్రమే డిపాజిట్ చేశారు. అంటే ఐదేళ్లలో బ్యాంకుల్లో డిపాజిట్ కాని వెంకన్న స్వామి సొమ్ము దాదాపు 2709 కోట్లు.. ఇదే విషయంపై టీటీడీ ఆస్తులను చంద్రబాబు దోచుకుంటున్నాడని ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించాడు. దీంతో చంద్రబాబు సోమిరెడ్డిని రంగంలోకి దింపి రమణదీక్షితులను లోపలేసి నాలుగు తగించాలని తిట్టించి మరీ ఆయన్ని పదవి నుంచి తొలగించాడు. మొత్తంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2709 వేల కోట్లు డిపాజిట్ చేయకుండా చంద్రబాబు వాడేసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుం మరి డిపాజిట్ చేయకుండా దాచిన డబ్బును చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నాడా..ఏదైనా సంక్షేమ పథకాలకు మళ్లించాడా..వాటిలో కమీషన్ల పేరుతో ఎంత నొక్కేసాడన్నది తెలియాల్సి ఉంది.
