ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. ఈ 5 నెలల కాలంలో సీఎం జగన్ ప్రజారంజక పాలనకు ప్రజల జేజేలు పలుకుతున్నారు. ఏడాదిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేర్చేందుకు సీఎం జగన్ సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో నవరత్నాలపథకాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, డ్వాక్రామహిళలు, యువకులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, వెలుగు యానిమేటర్లు, హోంగార్డులు, 108 సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, మత్స్యకారులు, నిరుద్యోగ యువతీ యువకులు, అగ్రిగోల్డ్ బాధితులు..ఇలా పలు వర్గాలకు లబ్ది చేకూరేలా పలు సంక్షేమ పథకాలపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల సమున్నత అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. 5 నెలల కాలంలో దాదాపు 150 కు పైగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే వాటిలో ప్రధానమైన 15 సంక్షేమ పథకాల గురించి కుప్లంగా తెలుసుకుందాం.
5 నెలల పాలనలో సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న 15 అద్భుత సంక్షేమ పథకాలు
1
ఉద్యోగాల విప్లవం
* నాలుగు నెలలు పూర్తిగా నిండకుండానే 4.10 లక్షల ఉద్యోగాలు
ఇందులో 1.35 లక్షల శాశ్వత గ్రామ సచివాలయ ఉద్యోగాలు,
2.75 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు
2
వైయస్ఆర్ రైతు భరోసా
* వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున
దాదాపు 45 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు పెట్టుబడి సాయం
3
అమ్మ ఒడి పథకం
* 2020 , జనవరి 9 నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున సాయం
* మొత్తం 43 లక్షల మంది తల్లులకు రూ.6455 కోట్లు పంపిణీ
4
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు పరిహారం
* అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు తొలి విడతలో భాగంగా రూ. 10 వేల లోపు
డిపాజిట్ చేసిన 3.70 లక్షల మందికి రూ. 263 కోట్లు పంపిణీ
* రెండో విడత చెల్లింపుల్లో రూ. 20వేల లోపు డిపాజిటర్లకు పరిహారం
అందించేందుకు రూ. 811 కోట్లు విడుదల చేయనున్న ప్రభుత్వం
5
ఆరోగ్యశ్రీ పథకం
* వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
* హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
* చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం
* కిడ్నీ, తలసేమియా, కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేల పింఛను.
* కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఇందుకు రూ.1500 కోట్లు కేటాయింపు.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీకి కేటాయింపులు – రూ. 1,740 కోట్లు.
* ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది.
6
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం
* జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తిగా ఫీజు రీయిబర్స్‌మెంట్
* జగనన్న విద్యా వసతి దీవెన పథకం కింద 2019-2020వ ఆర్థిక సంవత్సరం నుంచి
ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు అందజేత
* డిగ్రీ, ఉన్నత చదువులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలలు, ఎయిడెడ్,
ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
7
మద్యపాన నిషేదం దిశగా అడుగులు
– రాష్ట్రంలో 38 స్టార్ హోటళ్లు, 4 పబ్బులు మినహాయించగా
ఉన్న 839 బార్‌షాపుల్లో 40 శాతం అనగా 319 బార్లు తగ్గింపు
* చంద్రబాబు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,380 ప్రయివేట్ మద్యంషాపుల్లో
880 తగ్గించి 3,500 ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేశారు. అంటే 20 శాతం తగ్గింపు.
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 వేల బెల్ట్ షాపులను (గతంలో ఒక్కో షాప్ క్రింద 10 బెల్ట్ షాపు లు ఉండేవి).
తొలగించి మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు.
* రాష్ట్రవ్యాప్తంగా 3,500 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది
సేల్స్‌మెన్‌లను నియమించడం ద్వారా దాదాపుగా 12 వేల మందికి ఉపాధి అవకాశాలు
8
ప్రతి పేదవాడికి ఇల్లు
* ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందజేత
* మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ అవసరమైతే ఆ ఇంటిమీద పావలా వడ్డీకే
బ్యాంకుల నుంచి రుణాలు అందించనున్న ప్రభుత్వం
9
వైయస్ఆర్ ఆసరా పథకం
* రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు
* మహిళలు చెల్లించే వడ్డీని ప్రభుత్వం రాయితీ రూపంలో విడతల వారీగా
ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేస్తోంది
* ప్రస్తుత బడ్జెట్లో డ్వాక్రా మహిళల కోసం రూ. 1,788/-/- కోట్లు కేటాయింపు
* పాత బకాయిలకు – రూ. 3,037/- కోట్లు (2016 ఆగస్టు నుంచి 2019 మార్చి వరకు)
– గ్రామీణ పరిధిలోని డ్వాక్రా మహిళలకు – రూ. 2,303/- కోట్లు
– పట్టణ పరిధిలోని డ్వాక్రా మహిళలకు – రూ. 734/- కోట్లు
– సున్నావడ్డీకే రుణ మంజూరు లక్ష్యం – రూ.16,819/- కోట్లు
– వడ్డీ రాయితీకి బడ్జెట్లో కేటాయింపులు
1) గ్రామీణ ప్రాంతాల్లో – రూ. 1,140/- కోట్లు
2) పట్టణ పరిధిలో – రూ. 648/- కోట్లు
10
చిరుద్యోగులకు వేతనాల పెంపు
* సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆ రంగాల్లో పని చేస్తున్న వారికి వేతనాలు భారీగా పెంపు
* ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
* బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు
* హోం గార్డుల వేతనం రూ.18వేల నుంచి రూ.21 వేలకు పెంపు
* వీవోఏ(వెలుగు యానిమేటర్లు)ల వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపు
* 108 పైలెట్(డ్రైవర్)లకు వేతనం రూ.13 వేల నుంచి రూ.28 వేలకు పెంపు
ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)ల వేతనం రూ.15 వేలు నుంచి రూ. 30 వేలకు పెంపు
* 104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ల వేతనం రూ.17,500/- నుంచి రూ.28,000/-లకు,
డ్రైవర్‌కు వేతనం రూ.15,000/- నుంచి రూ. రూ.26,000/- లకు పెంపు.
* మధ్యాహ్నభోజన కార్మికులకు వేతనం నెలకు రూ.3,000/- పెంచుతూ నిర్ణయం
11
వైయస్ఆర్ వాహన మిత్ర
* ఏపీలో ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం
ఏటా రూ. 10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం అమలు
* ఈ డబ్బును వాహనాలకు ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలి
12
మన బడి నాడు-నేడు
* మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో
మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లు కేటాయింపు
* తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ధి
13
వైయస్ఆర్ కంటి వెలుగు
* రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసి, వారి నేత్ర సమస్యలకు పరిష్కారం చూపడమే కంటి
వెలుగు పథకం అమలు
* తొలి విడతలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు
* నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపిస్తారు. తర్వాత.. 3, 4, 5, 6 దశల్లో
కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు
* 2020, ఫిబ్రవరి నుంచి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు
14
మత్స్యకారులకు వైయస్ఆర్ భరోసా
* మత్య్సకారులకు వైఎస్సార్ భరోసా పథకం కింద ఆర్థిక సాయం
* ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు రెండు నెలలు చేపల వేట నిషేధం సమయంలో
చంద్రబాబు ప్రభుత్వం కేవలం నెలకు రూ.2 వేల చొప్పున రూ.4 వేలు ఇస్తే,
జగన్ ప్రభుత్వం రూ.5 వేల చొప్పున ఆ రెండు నెలలకు గాను రూ.10 వేలు ఆర్థిక సాయం అందించనుంది.
15
రివర్స్ టెండరింగ్
* రివర్స్‌టెండరింగ్ ద్వారా ప్రాజెక్టుల్లో రూ.1230 కోట్లు ప్రజాధనం ఆదా
చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోతూ..రూ.65 వేల కోట్ల పెండింగ్ బిల్లులతో కలిపి రూ.2.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి ఖజానా ఖాళీ చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున కేవలం రూ.100 కోట్లు మాత్రమే మిగిల్చాడని మే 30, 2019న టీడీపీ కరపత్రిక ఈనాడు కథనం ప్రచురించింది.అయినా కూడా ఇంత స్వల్పకాలంలో ఎవరు చేయని విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సుపరిపాలన చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు ఆయన పార్ట్‌నర్ పవన్, బాబు అను కుల మీడియా నిత్యం మత విద్వేషాలు రగిలిస్తూ హిందువులను జగన్‌కు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. అయినా ఈ కుట్రలను చిరునవ్వుతో చేధిాస్తూ..ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపేందుకు సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. 5 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటున్న సీఎం జగన్ 5 ఏళ్లు పూర్తి అయ్యేసరికి తండ్రిని మించిన తనయుడిగా, ప్రజా సంక్షేమ పాలకుడిగా ఏపీ ప్రజల గుండెల్లోచిరస్థాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. జయహో జగన్..!