టీడీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది..ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అపర చాణక్యుడు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలన్నీ బెడిసిగొడుతున్నాయి..రాజధాని తరలింపు డ్రామా అట్టర్‌ప్లాఫ్ అయిది.. పల్నాడు డ్రామా ఫెయిలైపోయింది, కోడెల డ్రామా వర్కవుట్ కాలేదు..ఇసుక డ్రామా ఉస్కో అంది..ఇంగ్లీష్ మీడియం డ్రామా మీడియాకే పరిమితం అయింది..ఇలా బాబుగారు వయసు మీదపడడంతో తప్పుడు స్కెచ్‌లు వేస్తున్నారో ఏమో కానీ…జగన్ సర్కార్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. అయినా బాబుగారు తనదైన భ్రమల్లోనే బతికేస్తున్నారు. ఇంకా ప్రజలు నన్నే కోరుకుంటున్నారు తమ్ముళ్లూ .. అంటూ బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తూ తనను తానే మోసం చేసుకుంటున్నాడు..మరోవైపు పార్టీకి రాజీనామా చేసిన నేతలు లోకేష్‌ను పప్పు అంటూ బండబూతులు తిడుతున్నారు. ఇక అందరిది ఒకెత్తు అయితే డైరెక్టర్ రాంగోపాల్ వర్మది మరొక ఎత్తు..చంద్రబాబు కపటత్వాన్ని, లోకేష్ అమాయకత్వాన్ని తన కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సిన్మాలో అచ్చుగుద్దినట్లు చూపిస్తున్నాడు. పప్పులాంటి అబ్బాయి అంటూ లోకేష్, బాబు పరువు నడిబజారులో పెడుతున్నాడు. ఈ సిన్మా రిలీజ్ అయితే బాబు, లోకేష్‌ల ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అవడం ఖాయం. ప్రస్తుతం తండ్రీ కొడుకుల పరిస్థితి చూసి టీడీపీ నేతలు జాలిపడుతున్నారంట..ఇంత బతుకు బతికి ఆఖరికి బెజవాడ కరకట్టమీద హెరిటేజ్ కూరగాయలు, పాలు, మజ్జిగ అమ్ముకునే పరిస్థితి మాబాబుగారికి రాకూడదని తెలుగు తమ్ముళ్లు వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారంట..రామ..రామ…నేను ఈ మాటలు అనడం లేదండి. బాబుగారు వెన్నుపోటు పొడిచిన పెద్ద ఎన్టీఆర్ మీద ఒట్టు..ఈ మాటలు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. లోకేష్ ఎప్పటికీ అప్‌డేట్ కావడం లేదని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బాబుగారిని తిడుతున్నారంట.. 5 ఏళ్లు అవినీతి, అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు అధికారంలో ఏమాత్రం పనికిరారని తీర్పు ఇస్తే.. బెజవాడ కరకట్టపై కూర్చున్న చంద్రబాబు మాత్రం ప్రజలు ఇంకా తననే కోరుకుంటున్నారని కరకట్ట బాబా మాదిరిగా ప్రవచనాలు చెబుతున్నారని గడికోట ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరును గమనిస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పనికి వస్తారా అని గడికోట ప్రశ్నించారు. మొత్తంగా బాబు, లోకేష్‌లపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Related Articles
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
November 22, 2022
సీఎం కేసీఆర్ పై అభ్యంతకర పోస్టులు.. సీసీఎస్ లో సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి పిర్యాదు
March 24, 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభకాంక్షలు
March 7, 2022
తెలంగాణలో కొత్తగా 41,042 కరోనా కేసులు
February 19, 2022