సమాంతర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారు. కాన్సెప్ట్ సిటీల ద్వారా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కాన్సెప్ట్స్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.మొత్తం 10 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రతి నగరంలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలని సూచించారు. వేగంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే విధానాలు ఉండేలా చర్యలు తీసకుంటారు. పరిశ్రమలు పెట్టే సంస్థలకు ప్రోత్సాహక ధరలతో భూమి, నీరు, విద్యుత్ ఇస్తామనిస్పష్టం చేసారు. పట్టణాలకు అనుబంధంగా ఉండే ఈ కాన్సెప్ట్ సిటీలద్వారా పెట్టుబడులకు పెద్దఎత్తున స్వాగతం లభిస్తుందని, పారదర్శక విధానం ద్వారా సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలని, వాస్తవికంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం పని చేయాలని జగన్ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం తమ స్వంత ప్రయోజనాల కోసం తమ వర్గానికి చెందిన వారి కోసం రాజధానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దీనివల్ల అభివృద్ధి కేంద్రీకరణ జరిగి, ఇతర ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతాయి. కనుక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు కాన్సెప్ట్ సిటీ ప్రణాళిక ఉపయోగపడుతుందట.
