ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలో తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ ద్వారా వివాహం చేసుకోవాలంటే తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధృవీకరణ పత్రం సమర్పించాలనే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది టీటీడీ.
అయితే దీనిపై రెండు నెలల కిందటనే టీటీడీ నిర్ణయం తీసుకోగా తాజాగా ఆదేశాలను జారీ చేసింది టీటీడీ.గత కొంతకాలంగా శ్రీవారి సన్నిధిలో పెళ్ళి చేసుకోవాలనే వారికి తిరుమలలో కళ్యాణ వేదికలో టీటీడీ ఉచితంగానే వివాహాలు జరిపిస్తోంది.
ఇందుకోసం వధువు,వరుడు పుట్టిన తేదీలు,విద్యార్హతలు ,తల్లిదండ్రుల ఆధార్ కార్డుల పత్రాలు ,లగ్న పత్రికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే వీరి పెళ్ళి ఇరువైపులా తల్లి దండ్రులు తప్పకుండా హాజరవ్వాలి. ఒకవేళ వాళ్లు చనిపోతే డెత్ సర్టిపికేట్ సమర్పించాలి.