తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్ సింగ్ స్వీకరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”కాలుష్యం బారిన పడకుండా, ఆరోగ్యంగా జీవించాలంటే, స్వచ్చమైన గాలి అందరికీ అందాలి.ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని, ఆక్సీజన్ ను పెంపొందించవచ్చు.గ్రీన్ ఛాలెంజ్ అద్భుతం.దీనిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారిని అభినందిస్తున్నాను.నేను త్వరలోనే మూడు మొక్కలు నాటుతాను. ప్రతీ ఒక్కరూ తాము నాటిన మొక్కలను సంరక్షించాలి “అని అన్నారు.
