తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రపంచ స్థాయి స్టూడియోలకు నెలవుగా తెలంగాణ రాష్ట్రం మారింది. యానిమేషన్ వచ్చాక మరోస్థాయికి మూవీ మేకింగ్ చేరుకుంది.
బాహుబలి, అరుంధతి ,రోబో లాంటి మూవీల రాకతో యానిమేషన్ రంగంపై యువతకు ఆసక్తి పెరిగిందన్నారు. రానున్న ఏడాది చివరి నాటికి మొత్తం 270 బిలియన్ల డాలర్ల వ్యాపారం జరుగుతుంది అని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రపంచ ప్రముఖ యానిమేషన్ ,వీఎఫ్ఎక్స్,గేమింగ్ స్టూడియో సంస్థ టెక్నికల్ ఇండియా బాధ్యులు బిరెన్ ఘోష్ మాట్లాడుతూ” తెలంగాణలో పెట్టుబడులు ఆకర్శించడానికి మంత్రి కేటీఆర్,ఆయన బృందం చాలా కృషి చేస్తుందని ప్రశంసించారు. ఇతర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అంతగా స్పందన ఉండదు .. తెలంగాణలో పర్యటించినప్పుడు మాత్రం విశేష స్పందన ఉంటుంది అని ఆయన కొనియాడారు.