తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లో జరిగిన మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వైయస్సార్ వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చనిపోతే ఏకంగా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తానని ప్రకటించడంతో పాటు అనేక రకాల హామీలు జగన్ ఇస్తూ వాటికి రూపకల్పన చేయాలని ఆదేశించారు. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ సభలో కనిపించడంతో జనసైనికులు అపార్థం చేసుకున్నారు. రాజోలు లో సభలు జరగలేదు కదా ముమ్మిడివరంలో జరిగితే రాపాక ఎందుకు వెళ్లారు అని పోస్టింగ్ లు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా రాపాక వైసీపీలో చేరిపోయారు అంటూ ఆయనను కూడా విమర్శిస్తున్నారు.