ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళాగా బరిలోకి దిగి గెలుపొందిన సంగతి విదితమే.
అయితే ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కాదు .. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటి చేసి గెలుపొందారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని పిటిషనర్లు ఎన్ సింహాచలం, జయరాజు పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేసిన హైకోర్టు పూర్తి వివరాలను సమర్పించాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది.