తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటడులో ఈ రోజు గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… రైతు సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి తేడా చూడండి.
వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలని సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ఇస్తున్నారు. పెట్టుబడి కోసం ప్రతి ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు.పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏటా రూ.13 వేల కోట్లు కేటాయిస్తున్నారు.
ప్రమాదవశాత్తు ఎవరైనా రైతులు మరణిస్తే రైతు బీమాతో ఆసరాగా ఉంటున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోoది. వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.పత్తిని కొనుగోలు చెయ్యాల్సిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఐ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.