జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను జీవన్రెడ్డి సినిమాగా రూపొందించాడు. ఈ నెల 22 న ఈ సినిమాను విడుదల చేయుటకు రంగం సిద్ధమైనది. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో అలరించనున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి జార్జ్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ మాట్లాడారు. చిరు తాను 1972 లో ఒంగోలు లో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో జార్జ్ రెడ్డి ఆశయం ఆచరణ విద్యార్థి నాయకుడిగా ఆయన చేసిన పోరాటం తాను విన్నానని మళ్ళీ ఇంతకాలనికి వింటున్నానాని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా లోని అడుగు …అడుగు.. అంటూ సాగే పాటను వింటుంటే ఉద్వేగానికి లోనయ్యానని తెలిపారు. జార్జ్ రెడ్డి ఆశయం ఆచరణ విద్యార్థి నాయకుడిగా ఆయన సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపరని తెలుస్తుంది. సమాజాన్ని ప్రజలను చైతన్యం చేసే ఇలాంటి సినిమాలు ముందు ముందు ఇంకా రావాలని ఈ సినిమా చూసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.
