భారత రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చినవారిలో అబ్దుల్ కలాం గారు అగ్రస్థానంలో ఉంటారు. మిస్సైల్‌మ్యాన్‌గానే కాకుండా పీపుల్స్ ప్రెసిడెంట్‌గా ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ప్రపంచంలో ఎవరు, ఏ గొప్ప పనులు సాధించినా..ఎవరు ఖ్యాతి చెందినా వెంటనే వారి ఘనతను తన ఖాతాలో వేసుకోవడం..అంతా నావల్లే వారు ఆ ఘనత సాధించారంటూ డబ్బాకొట్టుకోవడం మన టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు కదా… కంప్యూటర్ కనిపెట్టింది నేనే.సెల్‌ఫోన్ కనిపెట్టింది నేనే..హైదరాబాద్‌ను నిర్మించింది నేనే..సింధూకు బాడ్మింటన్ నేర్పింది నేనే.. నావల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడు..సుందర్ పిచాయ్‌ను గూగుల్‌కు సీఈవో అయింది నావల్లే అంటూ ..ఇలా ప్రతి రోజు సమయం, సందర్భం లేకుండా, ఎదుటోళ్లు నవ్వుకుంటున్నా పట్టించుకోకుండా గొప్పలు చెప్పుకుంటూనే ఉంటాడు. ఆఖరికి దేశం గౌరవించే అబ్దుల్ కలాంగారిని నేనే రాష్ట్రపతిని చేశా..అంటూ ఆయన స్థాయిని తగ్గించేలా డబ్బా కొట్టుకుంటున్నాడు. చినబాబు లోకేష్ కూడా అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చంద్రబాబు ప్రతిపాదించాడు అంటూ బిల్డప్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని ఎల్లోమీడియా కూడా కలాంను మా బాబే రాష్ట్రపతిని చేశాడు..జాతీయ రాజకీయాల్లో మా బాబు అంతటోడు లేడు..భజన చేస్తూనే ఉంది.
తాజాగా రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను ఎవరు ప్రతిపాదించారు..ఎవరు ఎంపిక చేశారనే విషయంపై అసలు వాస్తవాలు బయటకు వచ్చాయి. నిజానికి చంద్రబాబు రాష్ట్రపతిగా ప్రతిపాదించింది కలాంను కాదు.నాటి ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్ పేరును బాబు బాబు ప్రతిపాదించారు. నాడు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్న తన మాటను ప్రధాని వాజ్‌పేయి కాదనడు అని బాబు నమ్మాడు. అయితే కృష్ణకాంత్ పట్ల ఎన్టీయేలోని కొన్ని పార్టీలు సముఖత చూపకపోవడంతో బాబు ప్రయత్నం బెడిసికొట్టింది..అంతటితో చంద్రబాబు సరిపెట్టుకుంటే బాగుండేది..కాని అబ్దుల్ కలాం ఎంపిక తన సూచన ప్రకారమే జరిగిందని స్వయంగా ప్రకటించుకుని జాతీయ రాజకీయ నాయకుల దృష్టిలో బాబు చులకన అయిపోయాడు. ఇక కలాం గారిని ప్రతిపాదించింది.. సమాజ్ వాది పార్టి అధినేత ములాయం సింగ్ యాదవ్. అయితే నాడు రాష్ట్రపతి పదవికి మహారాష్ట్ర గవర్నర్ అలెగ్జాండర్ పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే కృష్ణకాంత్, అలెగ్జాండర్ల పట్ల ఎన్డీయే కూటమిలో ఏకాభిప్రాయం లేకపోవడంతో అబ్దుల్ కలాం తెరమీదకు వచ్చారు. ఢిల్లీలో రాష్ట్రపతి పదవికి కలాం అభ్యర్థిత్వంపై చర్చ జరిపిన వాజ్‌పేయి ఆ తర్వాత నాటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌తో పాటు, ఎన్డీయో కూటమి భాగస్వామ్య పక్షాలకు సమాచారం అందించారు.
కలాం అభ్యర్థిత్వం ఖరారు అయిందని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే ఆయనకు ఫోన్ చేసి..కంగ్రాట్స్ సర్..మిమల్ని రాష్ట్రపతిగా ఎన్నుకున్నామంటూ ఫోన్ చేసి చెప్పాడు..ఇక అప్పటి నుంచి కలాంను నేనే రాష్ట్రపతిని చేశా అని చంద్రబాబు డప్పు కొట్టుకుంటూనే ఉన్నాడు. కలాంను రాష్ట్రపతిగా ప్రతిపాదించింది నేనే అంటూ చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని అదే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న వెంకయ్య నాయుడు కూడా ఖండిస్తూ ఒక వివరణ ఇచ్చారు. ప్రధాని వాజ్‌పేయ్ నిర్ణయం తీసుకుని అందరికి కబురు పంపారే తప్ప..రాష్ట్రపతిగా కలాం అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు పాత్ర ఏం లేదని చెప్పి వెంకయ్య నాయుడు గాలి తీశారు. ఒక వేళ నిజంగానే చంద్రబాబు కలాంగారి పేరు ప్రతిపాదిస్తే ఆయన మాటవరసకు అయినా..ఈ విషయాన్ని చెప్పేవారు. తన రాష్ట్రపతి ఎంపిక విషయాన్ని కలాం స్వయంగా తన టర్నింగ్ పాయింట్స్ – జర్నీ త్రూ ఛాలెంజెస్ అనే పుస్తకంలో ప్రస్తావించారు. అందులో తనకు వాజ్‌పేయి గారు ఫోన్ చేయబోతున్నారని తెలుసుకుని ఎదురు చూస్తున్న సమయంలో..నా పర్సనల్ ఫోన్‌కు చంద్రబాబు ఫోన్ చేసి మీకు ప్రధాని ఫోన్ చేయబోతున్నారు..మీరు వద్దు అనమాకండి అని చెప్పారని కలాం ఆ పుసక్తంలో రాశారు. అంతే కాని ఎక్కడా చంద్రబాబు తనను రాష్ట్రపతిని చేశారని ఆయన ప్రస్తావించలేదు. ఒక వేళ నిజంగా చంద్రబాబు రాష్ట్రపతి పదవికి తన పేరు ప్రతిపాదిస్తే బయటకు చెప్పకపోవడానికి కలాం గారు బాబులా కుసంస్కారి కాదు. కచ్చితంగా చెప్పేవారు..దీన్ని బట్టి రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు ప్రమేయం ఏం లేదని అర్థమవుతుంది. చూశారుగా.. కలాం గారిని నేనే రాష్ట్రపతిని చేశా అని చెప్పుకునే బాబుగారి బడాయి మాటల వెనుక అసలు వాస్తవం ఏంటో..బాబుగారంతే ఇలా డబ్బా కొట్టుకుంటూనే ఉంటాడు..మనం నవ్వుకుంటూనే భరించాలి..తప్పదు..అంతా మన ఖర్మ.