టీడీపీ అధినేత చంద్రబాబు గత ఐదేళ్లలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. సింగపూర్‌కు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి అక్కడి మంత్రి ఈశ్వరన్‌ను తీసుకువచ్చి ఒప్పందాలు చేసుకున్నాడు. రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అయితే ఇంత వరకు ఒక్క పని మొదలు పెట్టింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ కంపెనీతో చంద్రబాబు సర్కార్ చేసుకున్న ఒప్పందాలను పరిశీలించింది. ఏ విధంగా డెవలప్ చేస్తారు..ఏ మేరకు ప్రయోజనాలు ఉంటాయనే విషయంపై సదరు సింగపూర్ కంపెనీని ప్రశ్నించింది. దీంతో జవాబు చెప్పలేని సింగపూర్ కంపెనీ అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. తాజాగా అమరావతి నుంచి సింగపూర్ కంపెనీ తప్పుకోవడంతో చంద్రబాబు వైసీపీ సర్కార్‌పై అక్కసు వెళ్లగక్కాడు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి సింగపూర్ కంపెనీ తప్పుకోవడం పెద్ద బ్యాక్‌డ్రాప్ అన్నారు. రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలతో కలిపి.. మొత్తం 55 వేల ఎకరాలు సమీకరించామని బాబు చెప్పుకొచ్చాడు. భవన నిర్మాణ సముదాయాలు పూర్తయితే 10 వేల ఎకరాలు మిగులుతుందని చెప్పారు. వాటిని ఇప్పటి ధరకు విక్రయించినా లక్ష నుంచి రెండు లక్షల కోట్ల వస్తాయని, బంగారు బాతులాంటి అమరావతిని జగన్ సర్కార్ చంపేసిందంటూ అక్కసు వెళ్లగక్కాడు. అయితే బాబు విమర్శలపై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏంటీ చంద్రబాబు..అమరావతిలో రూ. 350 కోట్ల పెట్టుబడులు సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలవైతే.. వారికి ఇక్కడ రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి పేరిట కట్టబెట్టింది నువ్వు కాదా…సింగపూర్ కంపెనీలు కేవలం రూ. 350 కోట్ల పెట్టుబడి పెడితే ఐదువేల కోట్ల రూపాయలు వసతుల పేరుతో వాళ్లకు దోచిపెట్టాలని చూశావు…అందులో ఎన్ని వందల కోట్లు కమీషన్లు నొక్కేయాలని అనుకున్నావో…అందుకే ఇంత గగ్గోలు పెడుతున్నావు అంటూ నెట్‌జన్లు బాబుపై కౌంటర్లు వేస్తున్నారు. ఒక్క ప్రాజెక్టుకే 5 వేల కోట్లు సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టాలని చూసిన చంద్రబాబు మొత్తం అమరావతి రాజధానిని వాళ్లకు అప్పగిస్తే..ఎన్ని లక్షల కోట్లు వాళ్లకు ధారాదత్తం చేసేవాడో.. అందులో ఎన్ని వేల కోట్లు కమీషన్ల పేరుతో నొక్క్కేసేవాడో…అందుకే ఈ ప్రాజెక్టులో లొసుగులు గమనించిన జగన్ సర్కారు సదరు సింగపూర్ కంపెనీని ప్రశ్నించడంతో వాళ్లు జవాబు చెప్పలేక చేతులెత్తేశారు. భ్రమరావతిలో నీ దోపిడిని ఆరికట్టిన ప్రభుత్వాన్ని మెచ్చుకునేది పోయి..బంగారు బాతు, 2 లక్షల కోట్లు వచ్చేవి..చంపేశారంటూ ఏడుస్తున్నావు..అవును భ్రమరావతి నీకు బంగారు బాతే…మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే వస్తాయంటున్న 2 లక్షల కోట్లలో ఈజీగా లక్ష కోట్లు నీ జేబులో వేసుకునేవాడివి…ఏంటీ భ్రమరావతిని బంగారు బాతును చేశావా..గాడిద గుడ్డేం కాదంటూ చంద్రబాబుపై నెట్‌జన్లు విరుచుకుపడుతున్నారు.
