గత కొద్ది రోజులుగా సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసి, ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులను వైసీపీ ప్రోత్సహిస్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయి. తిరుమల డిక్లరేషన్ వివాదాన్ని తీసుకువచ్చి సీఎం జగన్‌పై బురద జల్లుతున్నాయి. అయితే హిందూ మతాన్ని, వైదిక సంప్రదాయాలను జగన్ ఎంతగానో గౌరవిస్తారు. చంద్రబాబులా చెప్పులు వేసుకుని హోమాలు వంటి పూజా కార్యక్రమాలను అగౌరవపర్చడం జగన్‌కు రాదు..చంద్రబాబులా గుడులు కూల్చగొట్టే మనస్తత్వం జగదికాదు..అంతే కాదు తిరుమలతో సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అన్యమతస్థులైన ఉద్యోగులను తీసేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఓ పని చూస్తే హిందూ ధర్మానికి, ఆలయాల పవిత్రతకు వైసీపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది. రెండు రోజుల క్రితం కార్తీక సోమవారం నాడు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డి పాళెంలో కామాక్షి తాయి ఆలయంలో జరిగిన ఓ వివాదాస్పద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే కార్తీక సోమవారం సందర్భంగా కామాక్షితాయి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. రాత్రి దీపాలు వెలిగించడానికి మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. వారు దీపాలు వెలిగిస్తుండగా..ఆలయంలో పని చేసే తాత్కాలిక ఉద్యోగి శేషురెడ్డి నీళ్లపైపులో దీపాలను ఆర్పివేశాడు. ఇదేమిటి అని ప్రశ్నించిన మహిళలు, భక్తులపై శేషురెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మహిళలను అసభ్యంగా దూషించాడు. ఈ ఘటనను భక్తులు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ఈ వీడియో చూసిన కోవూరు వైసీపీ ఎమ్మెల్యే వెంటనే మరుసటి రోజు ఉదయం గుడికి వచ్చి ఈ ఘటనపై ఆరా తీరాశారు.
కార్తీకదీపాలు ఆర్పివేసిన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రసన్నకుమార్ రెడ్డి… పవిత్రమైన కామాక్షితాయి ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తారా, భక్తుల మనోభావాలను గౌరవించరా అంటూ ఈఓ కృష్ణారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కార్తీకమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ వెలిగించిన కార్తీకదీపాలను ఆర్పివేయడం ఏమిటని మండిపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి వస్తున్న భక్తుల విషయంలో ఇలాగే వ్యవరిస్తారా అని ఆలయ అధికారులను ప్రశ్నించారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైనదన్నారు. జారులు, ఉద్యోగులు రాజకీయాలు చేస్తూ ఆలయాని అభాసుపాలుచేస్తున్నారన్నారు.ఇక నుంచి భక్తుల మనోభావాలు కించపరిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. వెంటనే శేషురెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహించారని కృష్ణారెడ్డిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఉద్యోగి శేషురెడ్డిని తొలగిస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఆలయం పరిసరాలతో పాటు చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉండడంపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఈఓను ప్రశ్నించారు. ఆలయంలో పగిలిన పోయిన చెత్తకుండీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొత్త చెత్తకుండీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయం పరిసరాలతో పాటు బ్రిడ్జిపై మందుబాబుల జోరు ఎక్కువగా ఉంటే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. ఆలయపవిత్ర మంటగలిపేలా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న ఆలయ సిబ్బంది తీరును మార్చుకోవాలని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం కామాక్షి ఆలయంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ సంప్రదాయాలకు, ఆలయాల పవిత్రతకు వైసీపీ ఎంత చిత్తశుద్దితో వ్యవహరిస్తుందో కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించిన తీరు అద్దం పడుతుంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా మతం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు, ఎల్లోమీడియా ఛానళ్లకు కనువిప్పు కలగాలని వైసీపీ నేతలు అంటున్నారు. హిందూ మత సంప్రదాయాల పరిరక్షణకు పెద్ద పీట వేస్తుంది మా నాయకుడు సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే అని చంద్రబాబులాగా చెప్పులు వేసుకుని పూజలు చేయం, గుడులు కూలగొట్టం అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.