లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16వ ఏట ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన మొదటిరోజు నుండే తన అద్భుతమైన ఆటతీరుతో దిగ్గజ ఆటగాళ్ళతో సబాష్ అనిపించుకున్నాడు. అలా ప్రతీ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బ్యాట్ తో పరుగులు సాధించాడు. మరోపక్క పెద్ద జట్లపై కూడా ఏమాత్రం భయపడకుండా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా జట్టుకి తోడుగా ఉన్నాడు. అయితే ఈ లిటిల్ మాస్టర్ కు ఈరోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇదేరోజున 2009 ముప్పై వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర నిలిచాడు. అంతేకాకుండా అదేరోజున తన 43వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.