గతంతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే, దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది.
– గతంలో పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6 వేల లోపు ఆదాయ పరిమితి ఉన్నవారు అర్హులైతే దానిని ప్రస్తుత ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది
– గతంలో కుటుంబానికి రెండు ఎకరాలలోపు మగాణి, 5 ఎకరాలు మెట్ట కలిగిన వారు అర్హులు కాగా, ప్రస్తుతం 3 ఎకరాలలోపు మగాణి, 10 ఎకరాల మెట్ట భూమి లేదా మగాణి, మెట్ట భూమి కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవారందరినీ అర్హులుగా గుర్తించారు.
– గతంలో నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు ఉన్నవారు అర్హులైతే, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని 300 యూనిట్లకు పెంచింది.
– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు అనర్హులు, అయితే పారిశుద్ధ్య కార్మికులను మినహాయింపు
-ఫోర్‌వీలర్ ఉను్న కుటుంబాలు అనర్హులు(టాక్సీ, ఆటో, ట్రాక్టర్‌కు మినహాయింపు)
– కుటుంబంలో ఏ ఒక్కరైనా ఆదాయ పన్ను చెల్లించినట్లైతే ఆ కుటుంబాలు అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తులు లేని వారు, 750 చదరపు అడుగుల లోపు మాత్రమే ఇల్లు కలిగిన వారు అర్హులు.
Tags ap government schemes jagan ysrcp