టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబుకు మేకులా తయారయ్యాడు అనడంలో సందేహమే లేదు. ఎప్పటినుండో తననే టార్గెట్ చేసుకున్నకు. ఆయనకు భయం అంటే ఏమిటో తెలియదు. బాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఆయనకు యాంటీగానే ఉన్నారు. ఇంక ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో అడుగు ముందుకు వేసాడు వర్మ. ఇందులో చంద్రబాబు చేసిన అన్ని పనులను బయట పెట్టనున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్నీ సంఘటనలు ఇందులో ఉంటాయి. ఇప్పటికే మొన్న మొదటి ట్రైలర్ కే టీడీపీ నేతలకు గుండెల్లో రైళ్ళు పెరిగెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన రెండో ట్రైలర్ చూస్తే ఇంకా అంతే సంగతులు అని చెప్పాలి.
