శ్రీలంకలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి సాజిత్ ప్రేమదాస ఓడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి సుదర్శన గుణవర్ధనే బుధవారం వెల్లడించారు. గురువారం తన రాజీనామా లేఖను అధ్యక్ష కార్యాలయానికి పంపుతారని గుణవర్ధనే తెలిపారు. శ్రీలంక తదుపరి ప్రధానిగా ప్రస్తుత అధ్యక్షుని సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్స నియమితులయ్యే అవకాశాలున్నాయి. కాగా శనివారం వెలువడిన అధ్యక్ష ఫలితాల్లో గొటబయ దాదాపు 13 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.