చంద్రబాబు ఏంటీ..తనను వాడు వీడు అంటూ తిట్టిన వల్లభనేని వంశీని పొగడడం ఏంటీ…తన ఏకైక పుత్రరత్నం లోకేష్‌ను అవమానించడం ఏంటని అనుకుంటున్నారా..అవునండి..నిజమే..తనకు తాను గొప్పలు చెప్పుకోబోయి.. ఎదుటివాళ్లతో తిట్టించుకోవడం బాబుగారికి అలవాటే కదా..అలవాటులో పొరపాటున గొప్పలు చెప్పుకోబోయి..తన కొడుకు లోకేష్ పరువు పోయేలా చేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పోయేవాడు ఊరకే పోకుండా చంద్రబాబును, ఆయన పుత్రరత్నం లోకేష్‌ను బండబూతులు తిట్టాడు. దీంతో ఫీలైపోయిన బాబుగారు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. నేను పార్టీకి రాజీనామా చేస్తే డాష్..గాడు (ఇక్కడ బీప్ వేసుకోవాలి..) నన్ను సస్పెండ్ చేయడమేంటీ అంటూ బాబుపై వంశీ బూతులు లంకించుకున్నాడు. అయితే వంశీ వైసీపీలో చేరినా..పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదంటూ..చంద్రబాబు బిల్డప్ ఇవ్వబోయాడు..తాజాగా పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ వంశీ రాజీనామా వ్యవహారాన్ని చంద్రబాబు ప్రస్తావించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..గెలిచిన 23 మంది పులుల నుంచి ఒక పులి బయటకు వెళ్లిపోయింది..అయినా పార్టీ నేతలు ఎవరూ బెదరిపడాల్సిన అవసరం లేదు..టీడీపీని ఎవ్వరూ ఏం చేయలేరంటూ..బాబుగారు వీరావేశంతో డైలాగులు వేశాడు. ఎంత స్పీడ్‌గా పులులు అంటూ డైలాగులు వేశాడో..అంతే స్పీడుగా బాబుగారికి రాజకీయ ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడ్డాయి. అవును..40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన నిన్ను 40 ఏళ్ల యువకుడు వంశీలాగా ఎవరూ ఇంతలా ఎదిరించలేదు..ఇంత ఘోరంగా ఎవరూ నీ నిజస్వరూపాన్ని బయటపెట్టలేదు..నిజంగా వంశీ పులే..ఇక నువ్వున్నట్లు గెలిచినోళ్లు పులులు అయితే… మరి ఓడిపోయిన నీ కొడుకు లోకేష్‌ను ఏమంటారు..పిల్లి అంటారా అంటూ చంద్రబాబుకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే పప్పు అంటూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో సహా, రాజకీయ ప్రత్యర్థులు లోకేష్‌ను ఆడుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు వంశీ పులి అయితే లోకేష్ పిల్లి అంటూ నెట్‌జన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. చూశారుగా..తమకు తాము పులులం అని గొప్పలు చెప్పుకోబోయి పాపం లోకేష్‌ను చంద్రబాబు ఎలా అవమానాలు పాలుచేశాడో…అందుకే అంటారు..బిల్డప్ ఇచ్చుకునే ముందు కాస్త ఫ్రంటూ, బ్యాక్ చూసుకోవాలని..మా బాబుగారికి ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో అంటూ..తెలుగు తమ్ముళ్లు తలలు బాదుకుంటున్నారు.
