ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యం అన్నారు.ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని,గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలన్నారు.రేషన్ కార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్ మెంట్‌కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయని,ఈ కార్డులు అక్కడే ప్రింట్ అయి లబ్ధిదారులకు అందాలంటే.. వ్యవస్థ అంతా సక్రమంగా, పటిష్టంగా ఉండాలన్నారు.గత ప్రభుత్వ ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లు రూ.4వేల కోట్లు పెండింగులో ఉన్నాయని, పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరుచేయడంతోపాటు, పారదర్శక విధానాలను, వచ్చే కంపెనీలకు ప్రోత్సాహక ధరలతో భూములు, నీరు, కరెంటు లాంటి సదుపాయాలను కల్పిస్తామన్నారు.
Home / ANDHRAPRADESH / గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థ అందించండి
Tags ap grama sachivaalayam jagan jobs ysrcp