టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో,ప్రస్తుతం జనసేన అధినేత అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ మూవీలో నటించిన కానీ లక్ బాగోక ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగైన హీరోయిన్ కృతి కర్భంద.
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ లో హీరో సోదరి క్యారెక్టర్ లో నటించిన కానీ ఈ ముద్దుగుమ్మ దశ తిరగలేదు. దీంతో ఈ అందాల రాక్షసి తమిళం,కన్నడ మూవీల్లో నటిస్తూ హిందీ చిత్రాలవైపు అడుగులేస్తోంది.
ఇందులో భాగంగా విడుదలైన హౌస్ పుల్ 4 తో తొలి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినట్లు వార్తలు వస్తోన్నాయి. తాను నటిస్తోన్న పాగల్ పంతీ మూవీలో హీరోగా నటిస్తోన్న పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తనపై వస్తోన్న వార్తలపై స్పందిస్తూ అవును నేను ఒక హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని పరోక్షంగా చెప్పుకు వచ్చింది ఈ అందాల రాక్షసి.