ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను ఎన్నికలకు ముందే చెప్పానని దశలవారీగా మధ్య నిషేధం చేసి మద్యం షాపులు జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తానని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పార్టనర్లకు గట్టిగా ఇచ్చాడు. “మద్య నిషేధంపై అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశలో ఏపీ సీఎం జగన్ గారు మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను 40 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించారు. బెల్టుషాపులు ఎగిరిపోయాయి. మద్యం విక్రయాల సమయం తగ్గింది. ఇక తనివితీరా ఏడవండి పార్టనర్లూ” అని అన్నారు.
