మన దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇవాళ ఆయన యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.