కన్న తల్లినే తాను నవమాసాలు మోసి.. కని.. పెంచిన విషయం మరిచింది. కన్న తల్లి అనే విషయాన్ని మరిచిపోయి కన్నకూతురిపై కిరోసిన్ పోసి మరి నిప్పు అంటించింది. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో నాగపట్టణం జిల్లా వాజ్మంగళం అనే గ్రామంలో ఉమా మహేశ్వరి,కన్నన్ దంపతులకు జనని(17)ఏళ్ల కూతురు ఉంది.
కన్నన్ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా .. ఉమా మహేశ్వరి రోజూ వారీ కూలీ చేస్తూ తన భర్తకు సహాకరిస్తూ ఉండేది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జనని దళిత కుటుంబానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం ఇంట్లో తెల్సి వాళ్లు జననికి వార్నింగ్ ఇచ్చారు.
అయితే జనని తన ప్రియుడుతో కలిసి పారిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెల్సి తీవ్ర కోపోద్రిక్తులైన ఉమా కూతురితో వాగ్వాదానికి దిగి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఈ క్రమంలో ఉమాకు కూడా అంటుకుంది నిప్పు. తీవ్ర గాయాలైన జననిని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందింది. ఉమా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.