ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..దీనిని సమర్దించేవారు,వ్యతిరేకించే వారు ఉన్నారు..అయిన విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఎం జగన్ చెప్పారు..ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభలో ప్రసగించారు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల సభ్యులు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు..ఈ పరిణామం పై ఏపీ సీఎం సీరియస్ అయినట్టు సమాచారం..ఇంగ్లీష్ బోధన విషయంలో ప్రభుత్వ,పార్టీ వైఖరికి భిన్నంగా ఎవరు మాట్లాడిన సహించేదిలేదని,దీన్ని వ్యతిరేకిస్తు ఎవరు మాట్లాడినా,ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారిని ఉపేక్షించేది లేదని సీఎం చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి..
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం పై వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు..నేను తెలుగు భాషకు మద్దతుగా మాట్లాడాను కానీ ఇంగ్లీష్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు..ఈ విషయం పై సీఎం జగన్ ను కలసి వివరణ ఇస్తానని ఎంపీ తెలిపారు.