రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్ ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ఉద్దేశమని ఆమేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బాండ్లతో భాగస్వామ్యంపైకూడా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. సహకార రంగంలో ప్రస్తుతం డెయిరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల స్థితిగతులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
వీటిని పటిష్టం చేయడం ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకు రావచ్చని తెలిపారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మకంగా ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. ఇప్పుడున్న సహకార డెయిరీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునే కొత్త వ్యూహాలు దిశగా అడుగులు వేయాలని, అందుకనే పెద్దబ్రాండ్ల భాగస్వామ్యం దిశగా ఆలోచన చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. చేయూత ద్వారా మహిళలకు ఆర్ధిక సహాయం చేస్తామని, వచ్చే నాలుగేళ్లలో పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామని, డెయిరీ కార్యక్రమాల ద్వారా వారి ఆదాయాలు పెంచే ఆలోచనలు కూడా చేస్తున్నామస సీఎం తెలిపారు. రానున్నరోజుల్లో సహకార డెయిరీల బలోపేతం, డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచడమనే మూడే కోణాల్లో కార్యక్రమాలు విస్తృతం చేస్తామని సీఎం చెప్పారు.