ఆంధ్రప్రదేశ్ లో వైయస్‌ఆర్ నవశకం..సంక్షేమ పథకాల అమలులో విప్లవానికి నాంది కాబోతోంది.. సంక్షేమ పథకాల పరిమితులను విస్తరిస్తూ నవంబర్ 20నుంచి డిసెంబర్ 20వరకు పాదర్శకంగా సర్వే చేపట్టి, సామాజిక తనిఖీ, గ్రామ సభలద్వారా వంద శాతం సంతృప్తిగా అర్హులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కుటుంబలో సంతోషాలను నింపడమే వైయస్‌ఆర్ నవశంక ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. జనవరి 1, 2020 నుంచి కొత్త కార్డులను(బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డు, వైయస్‌ఆర్ పెన్షన్ కానుక కార్డులు) పంపిణీ చేస్తారు. ప్రతి పథకానికి ప్రత్యేక కార్డుల జారీ చేయనున్నారు. ఎక్కువమంది ప్రయోజనం పొందేలా ఆదాయ పరిమితి కూడా భారీగా పెంచారు.
