చంద్రబాబుకి అధికారం కోల్పోవడంతో బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయిందనుకుంట. ఏవేవో కూతలు కూస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయనకు తెలీదు పాపం. టీడీపీ హయంలో ఎన్నో దౌర్జన్యాలు, అన్యాయాలు, రౌడీ పాలన జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుకి తెలిసే మరియు ఆయన అండతోనే ఇవన్నీ జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన దుశ్శాసనుడు చింతమనేని ప్రభాకర్‌ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలట. మీ బంధువైతే ఇంటికి పిలిచి మర్యాదలు చేయండి చంద్రబాబు గారూ. ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే. పోలీసులకు పచ్చ యూనిఫామ్ వేసిన చరిత్ర మీదే” అని మండిపడ్డారు.
