Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు భారీ షాక్.. ఇద్దరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..!

చంద్రబాబుకు భారీ షాక్.. ఇద్దరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి వలసలు ఊపందుకున్నాయి.  ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాబాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కాగా, మరొకరు కృష్ణా జిల్లా, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ధూళిపాళ నరేంద్ర టీడీపీలో యాక్టివ్‌గా లేరు వరుసగా 5 సార్లు గెలిచిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ ఈసారి వైసీపీ అభ్యర్థి  కిలారు రోశయ్య చేతిలో స్వల్ఫ తేడాతో ఓడిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ధూళిపాళ తాజాగా నారాలోకేష్ పర్యటనకు కూడా డుమ్మా కొట్టారు. ఇటీవల లోకేష్ పొన్నూరు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడి కుటుంబాన్ని పరామార్శించేందుకు వెళ్లారు. అయితే అయ్యప్పమాల ధరించిన ధూలిపాళ మరణించిన వారి కుటుంబానికి వెళ్లడం సరికాదనే ఉద్దేశంతోనే లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాని లోకేష్ పర్యటన సందర్భంగా ఎక్కడా ధూలిపాళ ప్రస్తావన కనిపించలేదు.  కాగా తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ మారాలనే ఉద్దేశంతో ధూలిపాళ ఉన్నట్లు సమాచారం. అయితే వైసీపీలో చేరాలా..బీజేపీలో చేరాలా అనే విషయంపై కార్యకర్తలతో సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని గుంటూరు జిల్లా టీడీపీ వర్గాలు అంటున్నాయి. బోడె ప్రసాద్ రాజేంద్రప్రసాద్‌కు డబ్బులు ఇచ్చినట్లు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో సంచలనం రేపాయి. వంశీ బాటలో బోడె ప్రసాద్ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నాడని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు వైసీపీ నేతలతో బోడె ప్రసాద్ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా బాబుగారి సామాజికవర్గానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు  టీడీపీని కుదిపేస్తున్నాయి. ఇదే జరిగితే..రాజధాని ప్రాంతంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat