ఒకపక్క జగన్ సర్కార్‌పై బురద జల్లే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉంటే.. మరో పక్క టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వల్లభనేని వంశీతో కృష్ణాజిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా అన్ని జిల్లాలలో పాకుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ధూళిపాళ, కృష్ణాజిల్లాలో బోడె ప్రసాద్ వంటి మాజీ ఎమ్మెల్యేలు , విశాఖలో గంటా, వాసుపల్లి గణేష్ తదితర ఎమ్మెల్యేలు, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప.గో. జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా బాటలో ఉన్నట్లు వస్తున్న వార్తలు చంద్రబాబును కలవరపెడుతున్నాయి. తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే ఫులపర్తి రామాంజనేయులు పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఐదేళ్లు భీమవరంలో ఎమ్మెల్యేగా హవా సాగించిన పులపర్తి గత సార్వత్రిక ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సంచలన విజయం సాధించారు. పులపర్తి అంజిబాబు మూడోస్థానంలో నిలిచిపోయారు. అయితే పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా గెలిపించాలనే తపనతోనే చంద్రబాబు భీమవరంలో పులపర్తి తరపున ప్రచారం చేయలేదు. ఇదే విషయాన్ని ఇటీవల పార్టీ సమావేశాల్లో చంద్రబాబే స్వయంగా చెప్పుకొచ్చాడు. కేవలం పవన్ కల్యాణ్‌ను గెలిపించేందుకు చంద్రబాబు తనను రాజకీయంగా బలి చేశాడని పులపర్తి తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయమని, జనసేన, టీడీపీల పొత్తు ఉన్నంత కాలం మళ్లీ తాను ఎమ్మెల్యే కావడం అసాధ్యమని పులపర్తి భావిస్తున్నాడు..ముఖ్యంగా చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పులపర్తి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తణుకులో జరిగిన టీడీపీ నియోజకవర్గాల సమావేశాలకు అంజిబాబు డుమ్మాకొట్టినట్లు సమాచారం. అయితే అంజిబాబు బీజేపీలో చేరుతాడా..వైసీపీలో చేరుతాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తంగా పులపర్తి రాజీనామా వార్తలు ప.గో. జిల్లా టీడీపీలో కలకలం రేపుతున్నాయి.
